ETV Bharat / state

'What a surprise..! What next?.. హిండెన్​ బర్గ్​పై ఈడీ దాడులు ఉంటాయా?" KTR ట్వీట్ - The Modi Question BBC documentary

IT attacks on BBC KTR tweet: దిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు నేపథ్యంలో తెలంగాణ పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్​ వేదికగా స్పందించారు. "వాట్ ఏ సర్ ప్రైజ్" అని పెర్కొన్న ఆయన.. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఈడీ దాడులు జరగడం బాధకరమని పేర్కొన్నారు.

IT attacks on BBC KTR tweet
IT attacks on BBC KTR tweet
author img

By

Published : Feb 14, 2023, 5:38 PM IST

IT attacks on BBC KTR tweet: ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. దిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఐటీశాఖ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. "వాట్ ఏ సర్ ప్రైజ్" అని పేర్కొన్న ఆయన.. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీ దాడులు జరగడం బాధాకరమని తెలిపారు. "WHAT NEXT" అంటూ పేర్కొంటూనే.. అదానీ వ్యవహారంపై రిపోర్ట్​ ఇచ్చిన హిండెన్​ బర్గ్​ సంస్థపై తదుపరి దాడులు ఉంటాయా..! అని ప్రశ్నించారు.

  • What a surprise!! 😁

    A few weeks after they aired the documentary on Modi, BBC India now raided by IT

    Agencies like IT, CBI and ED have become laughing stock for turning into BJP’s biggest puppets

    What next? ED raids on Hindenberg or a hostile takeover attempt? pic.twitter.com/yaZ4ySw88f

    — KTR (@KTRBRS) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది జరుగుతోంది: దిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు 'దాడులు' నిర్వహించారు. ఐటీ శాఖ డైరెక్టర్ జనరల్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. ఈ సోదాలపై ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. సర్వే మాత్రమే చేస్తున్నామని, సోదాలు చేయట్లేదని తెలిపారు. భారత్​లో బీబీసీ పన్ను ఎగవేసిందన్న కారణాలతోనే ఈ సర్వే చేస్తున్నట్ల వెల్లడించారు.

అసలేంటి బీబీసీ డాక్యుమెంటరీ..? 2002లో గోద్రా ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రను విమర్శనాత్మకంగా చూపించింది బీబీసీ మీడియా సంస్థ. 'ఇండియా: ద మోదీ క్వశ్చన్​' పేరుతో రెండు ఎపిసోడ్​ల సిరీస్‌ను బీబీసీ రూపొందించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ప్రభుత్వం దీని ప్రసారంపై నిషేధం విధించింది.

కేంద్రానికి సుప్రీం ఆదేశాలు: బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని ఎందుకు నిలిపేశారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ తదుపరి విచారణలోగా కోర్టుకు సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ: మరోవైపు, ఈ సోదాలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాము అదానీ సమస్యపై జేపీసీ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూ ఉంటే.. అధికార పార్టీ మాత్రం బీబీసీ వెంట పడుతోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతను గుర్తు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. తప్పు చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలోని సంస్థలన్నీ పనిచేస్తాయని వ్యాఖ్యానించింది. బీబీసీ ప్రపంచంలోనే అత్యంత అవినీతితో కూడిన సంస్థ అని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. బీబీసీ దుష్ప్రచారం కాంగ్రెస్ అజెండాకు చక్కగా సరిపోతుందని బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

మా మార్కెట్​లో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి : కేటీఆర్‌ ట్వీట్‌

'బీబీసీ ఎపిసోడ్​ను ఎందుకు ప్రసారం చేయొద్దు?'.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

'BBC డాక్యుమెంటరీ ఓ కుట్ర.. వలసవాద మనస్తత్వంతో వ్యవహరిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.