KTR on Hyderabad Metro Expansion : హైదరాబాద్ నగరం మెట్రో(Hyderabad Metro) రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్‌పోర్ట్ మెట్రో వ్యవస్థపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెట్రో రైల్ భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాని ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారితో ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరిస్తూ, బలోపేతం చేయాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని.. ఈ దిశగా మెట్రో విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Metro Line From Lakdikapul to BHEL : అంతకంతకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచనన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వే(Hyderabad Airport Express Metro)తో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైలు మాస్టర్ ప్లాన్‌పైన ప్రజెంటేషన్ అందించారు. ప్రస్తుతం జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్ అథారిటీకి చెందిన 48 ఎకరాల స్థలాన్ని వెంటనే మెట్రో డిపో కోసం కేటాయించాలని కేటీఆర్ ఆదేశించారు.
Hyderabad Metro Latest News : మెట్రో విస్తరణ ప్రణాళికలపైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రి కేటీఆర్ కోరారు. లక్డికపుల్ -బీహెచ్ఇఎల్, ఎల్బీనగర్-నాగోల్ వరకు విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.9వేల100 అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే అడిగామని.. దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మెట్రో లైన్‌ను భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి.. ప్రాథమిక రిపోర్టులను.. పూర్తి వివరాలతో సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పాతబస్తీకి మెట్రో పక్కా.. మూడేళ్లలో ఎయిర్‌పోర్టు మెట్రో రెడీ : కేటీఆర్
Metro Line From Nagole to LB Nagar : మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు భారీ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ జాగాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లకు కేటీఆర్ ఆదేశించారు. సమావేశం అనంతరం ఎమ్ఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. త్వరలోనే పాతబస్తీలో మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
'దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో'