తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడులు, తయారీ రంగాలకు కేంద్రమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ మహేశ్వరంలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ మోడల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డేటా సెంటర్, లాజిస్టిక్స్ మొదలైన అన్ని రకాల రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో మలబార్ రిఫైనరీ జ్యువెల్లరీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు. దాదాపు రూ.750 కోట్ల పెట్టు బడులతో పాటు.. 2750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలో బహుమతులుగా బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఉందని చెప్పారు. ఫలితంగా జ్యువెల్లరీ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జ్యువెల్లరీ తయారీలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 6వ అతి పెద్ద జ్యువెల్లరీ తయారీ నగరంగా పేరు పొందిందని కేటీఆర్ అన్నారు.
మహేశ్వరంలో 3.7 ఎకరాల్లో తాము నిర్మిస్తున్న ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రతి ఏటా 10 టన్నుల బంగారం.. 1,5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు చేయగల సామర్థ్యం ఉందని మలబార్ సంస్థ ఛైర్మన్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్‌రంజన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన.. 20న అల్పపీడనం..!
'రూ.10 లక్షలు లోన్ ఇవ్వకపోతే బ్యాంక్ పేల్చేస్తా.. ఛైర్మన్‌ను కూడా లేపేస్తా'