ETV Bharat / state

KTR on Hyderabad Development : 'దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌'

SemiConductor Design Development Facility in Hyderabad : దేశానికి లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. భారత్‌లోని అతిపెద్ద మెడికల్ డివైజ్ పాత్రికేయులు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే మొబిలిటీ వ్యాలీ ద్వారా హైదరాబాద్​ను అగ్రస్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు.

KTR
KTR
author img

By

Published : Jul 3, 2023, 1:23 PM IST

KTR Inaugurated SemiConductor Design Development : సెమీ కండక్టర్ రంగంలో హైదరాబాద్ ముందడుగు వేస్తోందని.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల.. నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందని చెప్పారు. కోకాపేటలో వన్‌ గోల్డెన్ మైల్‌లో సెమీ కండక్టర్ డిజైన్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి.. మొబిలిటీ వ్యాలీ ద్వారా హైదరాబాద్​ను అగ్రస్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు.

హైదరాబాద్​లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఉందని కేటీఆర్ తెలిపారు. టాస్క్​ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని.. పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నగరం గణనీయమైన అభివృద్ధి సాధించిందని వివరించారు. దేశంలో 40 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. దేశంలో అతిపెద్ద వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్‌ ఇక్కడుందని కేటీఆర్ వెల్లడించారు.

KTR on Hyderabad Development : సుల్తాన్‌పూర్‌లోని మెడ్‌ డివైసెస్‌ పార్క్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కేంద్రమని కేటీఆర్ పేర్కొన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, ప్రోటోటైప్‌ తయారీపై.. తాము దృష్టి సారించామని చెప్పారు. ఈ రంగంలో మరింత సహకారం అవసరమని వివరించారు. సెమీ కండక్టర్ల రంగంలో భారత్‌ బలమైన ముద్ర వేయాలంటే బలమైన శ్రామిక శక్తి.. బలమైన మేధో విభాగం సేవలు కావాలన్నారు. ఈ రంగంలో ఇప్పుడు చాలా ప్రాథమిక దశలో ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

SemiConductor Design Development Facility in Hyderabad : మరోవైపు నాస్కామ్ లెక్కల ప్రకారం.. దేశంలో 1/3 ఉద్యోగాలు.. హైదరాబాద్ నుంచే ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని వివరించారు. భారత్‌లోని అతిపెద్ద మెడికల్ డివైజ్ పాత్రికేయులు కూడా ఇక్కడే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

"దేశంలో లైఫ్‌ సైన్సెస్‌కు హైదరాబాద్‌ రాజధానిగా ఉంది. దేశంలో 40 శాతం ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. దేశంలో అతిపెద్ద వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్‌ ఇక్కడుంది. సుల్తాన్‌పూర్‌లోని మెడ్‌ డివైసెస్‌ పార్క్‌ ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కేంద్రం. సాంకేతిక ఆవిష్కరణలు, ప్రోటోటైప్‌ తయారీపై మేం దృష్టి సారించాం. ఈ రంగంలో మరింత సహకారం మనకు అవసరం.సెమీ కండక్టర్ల రంగంలో భారత్‌ బలమైన ముద్ర వేయాలంటే బలమైన శ్రామికశక్తి, బలమైన మేధోవిభాగం సేవలు మనకు కావాలి. ఈ రంగంలో అమెరికా, తైవాన్‌, సెమీకండక్టర్ ఎకో సిస్టం కలిగిన ఇతర దేశాలతో పోలిస్తే... మనం ఇప్పుడు చాలా ప్రాథమిక దశలో ఉన్నాం. కానీ రాబోయే దశాబ్ద కాలంలో సెమీ కండక్టర్ల రంగంలో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నా. ఈ బాధ్యతను పంచుకోవడంలో హైదరాబాద్‌ కీలకపాత్ర పోషిస్తుంది. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ కృషిలో బెంగళూరు, చెన్నై, పుణే, ఇతర నగరాల కంటే మనం చాలా ముందంజలో నిలుస్తామని నమ్ముతున్నా." - కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్

ఇవీ చదవండి: Telangana Diagnostics Hubs : 'పేదల వైద్య ఖర్చులు తగ్గించడంలో T-డయాగ్నోస్టిక్స్​ చొరవ అద్భుతం'

KTR Says Party Will Win 100 Seats : 'ఇప్పుడు చూసింది ట్రైలర్​నే.. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 సీట్లు ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.