తెరాస కార్యకర్తలంతా.. సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ సాహిత్యం, రాష్ట్రాభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు.
మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము చెక్కులను పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుదని హామి ఇచ్చారు.
ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల