ETV Bharat / state

KTR Speech at Ward Office Inauguration : 'వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే మా లక్ష్యం'

author img

By

Published : Jun 16, 2023, 12:05 PM IST

Updated : Jun 16, 2023, 12:21 PM IST

KTR Inaugurated Ward Office in Hyderabad : పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా వార్డు కార్యాలయాలు పనిచేస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే జీహెచ్​ఎంసీలోని అన్ని వార్డుల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న మున్సిపాలిటీల్లో కూడా వార్డుకొక అధికారి అందుబాటులో ఉంటారన్నారు.

KTR
KTR
పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం సంతోషకరం: కేటీఆర్‌

KTR Inaugurated GHMC Ward Office in Kachiguda : పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే జీహెచ్​ఎంసీలోని అన్ని వార్డుల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన... వార్డు పాలన ద్వారా జరిగే అభివృద్ధిపై పలు సూచనలు చేశారు.

KTR Comments on Ward Governance in Hyderabad : పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా వార్డు కార్యాలయాలు పనిచేస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీల వంటి వాటి నిర్వహణకు ఇంజినీరింగ్ సిబ్బంది, భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది, దోమల సమస్యకు ఎంటమాలజీ విభాగం అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అలాగే మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయానికి వార్డు శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, విద్యుత్ శాఖ తరఫున వార్డు లైన్‌మెన్, ఓ కంప్యూటర్ ఆపరేటర్.... ఇలా మొత్తం 10 మంది అధికారులు ఒక్కో వార్డు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత సులభమైన సేవలను అందిస్తారని వెల్లడించారు.

'పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం సంతోషకరం. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే మా లక్ష్యం. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారం. సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం. సహాయక పుర కమిషనర్ నేతృత్వంలో సమస్యల పరిష్కారం. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 1.25 కోట్ల జనాభా హైదరాబాద్‌లోనే ఉంది. హైదరాబాద్‌లో జనసాంద్రత విపరీతంగా పెరుగుతోంది. చిన్న మున్సిపాలిటీల్లో కూడా వార్డుకొక అధికారి అందుబాటులో ఉంటారు.'-కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

మంత్రి కేటీఆర్ ముందే ఘర్షణకు దిగిన బీఆర్​ఎస్ నేతలు : హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో బీఆర్​ఎస్ నాయకుల మధ్య గొడవలు... మరోసారి రచ్చకెక్కాయి. కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్ సమక్షంలోనే... బీఆర్​ఎస్ నేతలు పోటాపోటీగా వాగ్వావాదానికి దిగారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అవినీతికి పాల్పడుతున్నాడని... సీనియర్‌ నేతలు కార్యకర్తలను పట్టించుకోవడంలేదని అంబర్‌పేట్‌ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి వర్గీయలు ఆందోళనకు దిగారు. దళిత బంధు తరహా పథకాల్లో అవినీతికి పాల్పడుతున్నాడని... కేటీఆర్‌కి ఫిర్యాదు చేయగా ఇరువర్గాల స్వల్ప వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. స్పందించిన పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి పంపించివేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 16, 2023, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.