భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపిస్తారని, దసరా తర్వాత అందుకు సంబంధించిన పరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని పురపాలక శాఖా మంత్రి కేటీ రామారావు తెలిపారు.
హైదరాబాద్ నాగోల్లోని అయ్యప్ప నగర్లో పర్యటించిన మంత్రి... ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పలు కుటుంబాలకు అందించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పదివేల సాయం పరిహారం అందుతుందన్న కేటీఆర్... 4 లక్షల కుటుంబాలకు సాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానిక యంత్రాంగానికి సహకరించాలని కోరారు. నాగోల్, అయ్యప్ప నగర్ ప్రాంతాల నుంచి వరద నీరు మూసీలోకి వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇందుకోసం ఎంత వ్యయమైనా ఖర్చు చేస్తామన్న ఆయన... మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ పనులను వేగవంతం చేస్తారని చెప్పారు.
ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్