revanth reddy reaction on TSPSC paper leakage: పేపర్ లీకేజీలో అధికార పార్టీ నాయకుల హస్తముందంటూ విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పని చేస్తూ పోటీ పరీక్షలు రాయడానికి 20 మందికి ఎలా అనుమతి ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
2016లో 20 మందికి టాప్ 10 ఉద్యోగాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అమెరికా నుంచి వచ్చిన మాధురికి మొదటి ర్యాంక్, జూనియర్ అసిస్టెంట్ రజినికాంత్‌కు 4 వ ర్యాంక్ ఎలా వచ్చిందని అడిగారు. కేటీఆర్ పిఏ తిరుపతి, అరెస్టు అయిన రాజశేఖర్ రెడ్డి సొంత మండలం మల్యాలకు చెందిన వారికి 103 మార్కులు ఎలా వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరగాలనీ డిమాండ్ చేశారు. కేటీఆర్ బినామీ షాడో తిరుపతికి లీకేజీలో పాత్ర ఉందనీ ఆరోపించారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ట్విటర్ ద్వారా కౌంటర్...
KTR gave a counter to Revanth Reddy by twitter: తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకు ఉన్న ఊహగానాలతో తప్పకుండా వారు మంచి రచయితలుగా పనికొస్తారని మంత్రి కేటిఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ విషయంలో కేటిఆర్ మేనల్లుడు 10వేల కోట్లు తీసుకున్నారని.. గ్రూప్ 1 పరీక్షల్లో కేటిఆర్ పిఏ సంబంధీకులకు అత్యుత్తమ మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్న మాటలకు కేటిఆర్ స్పందస్తూ అతనికి పూర్తిగా మతిపోయిందంటూ ట్వీట్ చేశారు.
గంగుల కౌంటర్...
Gangula fires on revanth reddy, bandi sanjay: ప్రభుత్వంపై విపక్షాలు టీఎస్‌పీఎస్సీ ఘటనను సాకుగా చూపి కుట్రలు చేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్దికోసం విమర్శలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శాసనమండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీ ఎల్.రమణ బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నేత రూప్‌సింగ్‌తో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
టీఎస్‌పీఎస్సీ ఘటనను కాంగ్రెస్, బీజేపీలు బయటపెట్టలేదని.. ప్రభుత్వమే బయటపెట్టిందన్న మంత్రి...ఈ ప్రశ్నాపత్రం బయటపడిందని తెలియగానే ప్రభుత్వం సిట్ వేసిందని తెలిపారు. ఇది స్కాం కాదని ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుమాత్రమేనని పేర్కొన్నారు. రోశయ్య ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగాయని అప్పటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.
2010లో యూపీఎస్సీలో ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే ప్రధాని రాజీనామా చేశారా అని నిలధీశారు. యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. పారదర్శకంగా ఉన్నందునే పరీక్షలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై సీరియస్ యాక్షన్ ఉంటుందని గంగుల కమలాకర్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: