హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ డా.సి.నారాయణరెడ్డి సారస్వత సదనం ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సినారె పుట్టిన జిల్లాలో పుట్టడం గర్వకారణంగా ఉందని కేటీఆర్ అన్నారు. సినారె చిన్నతనం నుంచి తనలోని కవిని ఆవిష్కరించారని చెప్పారు. 12వ తరగతి వరకు ఉర్దూలో చదువుకున్నా.. తెలుగు సాహిత్యంపై వారు పట్టు సాధించారని తెలిపారు.
తెలంగాణ వైతాలికులను స్మరించుకుంటూ.. పలు కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్ని కలగలిపిన వ్యక్తే సినారె అని అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు వెళ్లిన మొదటి కవి సినారెనని గుర్తు చేశారు. తెలంగాణ కవులు, కళాకారులకు ఇదొక కొత్త వేదిక అని.. సాధ్యమైనంత త్వరగా ఈ సారస్వత సదనం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సిరిసిల్లలో గ్రంథాలయానికి సినారె గారి పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఇవాళ విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు