ETV Bharat / state

KTR Fires on Congress 6 Guarantees : 'స్కాముల కాంగ్రెస్‌కు స్వాగతం చెబితే.. స్కీములన్నీ ఎత్తేస్తారు' - KTR counter tweet on Congress guarantees

KTR Fires on Congress 6 Guarantees : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా.. మోసం, వంచన, ద్రోహం, దాఖలమయం అని అభివర్ణించారు. కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన గడ్డ తెలంగాణ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Twitter Latest
Minister KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 1:56 PM IST

KTR Fires on Congress 6 Guarantees in Telangana : తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ బహిరంగ సభలో.. ఆరు గ్యారెంటీ హమీలను (Congress Six Guarantees) సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్‌ నేతలు విరుచుకుపడుతున్నారు. ట్విటర్ వేదికగా మంత్రి హరీశ్‌ రావు.. హస్తం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వర్ణిస్తూ.. కాంగ్రెస్‌ గ్యారెంటీ హామీలను ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ ట్వీట్ (KTR Tweet ) చేశారు.

KTR at Mega Property Show in Hyderabad : 'నగరాభివృద్ధికి ఇది కేవలం ట్రైలర్​ మాత్రమే.. ముందుంది అసలు సినిమా'

KTR Tweet on Congress 6 Guarantees : కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా.. మోసం, వంచన, ద్రోహం, దాఖలమయం అని కేటీఆర్ అభివర్ణించారు. కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన గడ్డ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. కల్లబొల్లి గ్యారెంటీలు రాష్ట్రంలో చెల్లవని పేర్కొన్నారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవుతుందని తెలిపారు. కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు వస్తాయని చెప్పారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంట్ గతేనని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ఊడగొడతారని కేటీఆర్ వివరించారు.

KTR on Congress Six Guarantees : దగాకోరుల పాలన వస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోతుందని.. బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా.. ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అని కేటీఆర్ వెల్లడించారు. సమర్థత లేని వారికి ఓటేస్తే.. సకల రంగాల్లో సంక్షోభమేనని తెలిపారు. దిల్లీ కీలుబొమ్మలు కుర్చీ ఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెడతారని పేర్కొన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే.. సంపదనంతా స్వాహా చేస్తారని.. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం ఖాయమని కేటీఆర్ అన్నారు.

KTR Meeting with Maharashtra Representatives : 'బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది'

"స్కాముల పార్టీకి స్వాగతం చెప్తే.. స్కీములన్నీ ఎత్తేస్తారు. కర్షకుడి కష్టం తెలియని వాళ్లకు సీటు ఇస్తే.. అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ. పరిపాలన చేతగాని.. చేవలేని వాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలుస్తాయి. పనికిమాలిన వాళ్లు అధికారంలోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ. బుద్ధి కుశలత లేని వారికి చోటిస్తే భూముల ధరలు పడిపోతాయి. విషయం, విజ్ఞానం లేని వారిని విశ్వసిస్తే.. వికాసం మాయమై వినాశనం" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • మోసం..వంచన.. ద్రోహం..దోఖాలమయం
    కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా..!

    ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన
    తెలివైన తెలంగాణ గడ్డ..!

    కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..!
    ........
    రాబందుల రాజ్యమొస్తే
    రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..!

    కాలకేయుల కాలం వస్తే
    కరెంట్‌ కోతలు..కటిక…

    — KTR (@KTRBRS) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR On Congress : థర్డ్ గ్రేడ్ నాలాయక్స్‌ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం.. అథమ స్థాయికి పోతుందని కేటీఆర్ తెలిపారు. ఆర్థిక శాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో కలుస్తుందని చెప్పారు. జోకర్లకు.. బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలుస్తాయని వివరించారు. దాచి.. దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు నా తెలంగాణ అని అన్నారు. ఈనగాచి నక్కల పాలుజేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Harish Rao Counter to Congress Guarantees : 'కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది'

Minister KTR Interesting Comments : 'అటు ఇటు కాకుండా రాజకీయ నాయకుడినయ్యా..' పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.