ETV Bharat / state

కాంగ్రెస్​ పార్టీ అబద్ధపు హామీల వల్లే బీఆర్​ఎస్​ ఓడిపోయింది - సిద్ధరామయ్యకు కేటీఆర్ కౌంటర్​ - కేటీఆర్​ వర్సెస్​ సిద్ధరామయ్య ట్వీట్​ వార్​

KTR Counter to Karnataka CM Siddaramaiah : కాంగ్రెస్​ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లే బీఆర్​ఎస్​ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ ఆరోపించారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన ట్వీట్​కు ఆయన బదులిచ్చారు. డిసెంబరు తొమ్మిదో తేదీలోపు నెరవేరుస్తామన్న కాంగ్రెస్​ గ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

KTR
KTR Questioned on Congress Guarantees
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 4:01 PM IST

KTR Counter to Karnataka CM Siddaramaiah : డిసెంబర్ తొమ్మిదో తేదీలోపు నెరవేరుస్తామన్న కాంగ్రెస్​ గ్యారంటీల(Congress Six Guarantees) పరిస్థితి ఏంటని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్​ ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ హామీలు నకిలీవని, హామీలు ఇచ్చిన వారూ నకిలీ నేతలని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్​కు ఆయన ఎక్స్​(ట్విటర్​) వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లే తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని కేటీఆర్(KTR)​ ఆరోపించారు.

  • Dear Sri Siddaramaiah Garu,

    We’ve lost the election because your party had shamelessly misled the people of Telangana with Fake promises

    Dec 9th, 2023 has passed, but where is the:

    👉 Rythu Bharosa promised to farmers, tenant farmers and farm labourers

    👉 Rs 2 Lakhs Farm… https://t.co/CACSR7ai28 pic.twitter.com/pZGMdikfN4

    — KTR (@KTRBRS) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Siddaramaiah Tweet War : అంతకుముందు 'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ బీఆర్​ఎస్​ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే మీకు ఏది ఫేక్​, అలాగే ఏది ఎడిట్​ చేయబడింది, ఏది నిజం, దానిని ఎలా ధ్రువీకరించాలో కూడా తెలియదు. బీజేపీ నకిలీ, ఎడిట్​ చేసిన వీడియోలను సృష్టిస్తుంది. వాటిని మీ పార్టీ ప్రచారం చేస్తుంది. మీ పార్టీ బీజేపీకి బీ టీమ్​ అనడానికి ఇంకా ఏం ప్రూఫ్​ కావాలి' అని సిద్ధరామయ్య ట్వీట్​ చేశారు.

  • Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections?

    Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP.

    If you are… https://t.co/Ey5y9K3fLd

    — Siddaramaiah (@siddaramaiah) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MLA KTR Fires on Congress Party : ఈ ట్వీట్​పై స్పందించిన కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు తొమ్మిదో తేదీ నాటికి నెరవేరుస్తామన్న కాంగ్రెస్​ పార్టీ హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా(Rythu Barosha) ఎక్కడకు పోయిందని ధ్వజమెత్తారు. రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమైందని అడిగారు. రూ.4000 ఆసరా పింఛన్​ ఏమైందన్నారు. అలాగే రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ అన్న మాట ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌

"సిద్ధరామయ్య గారు, అబద్దపు హామీలతో మీ పార్టీ వాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారు కాబట్టే మేం ఎన్నికల్లో ఓడిపోయాం. డిసెంబర్ 9 దాటి పది రోజులు అయ్యింది. మీరు హామీ ఇచ్చిన రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా ఎక్కడ? రూ.2 లక్షల పంట రుణమాఫీ ఎక్కడ? రూ. 4000 ఆసరా పెన్షన్ ఎక్కడ? రూ. 500 గ్యాస్ సిలిండర్ ఎక్కడ? మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎక్కడ? మొదటి కేబినెట్‌లోనే మెగా డీఎస్సీ ఎక్కడ? మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత ఎక్కడ? ఈ హామీలు ఫేక్ ఆ? లేక ఈ హామీలు ఇచ్చిన మీ నాయకులే ఫేక్ ఆ? అలాగే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా?" - కేటీఆర్​, ట్వీట్​

KTR vs Siddaramaiah Tweet War : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారు కదా, ఆ మాట ఏమైందని కేటీఆర్​ అడిగారు. మొదటి కేబినెట్​లోనే మెగా డీఎస్సీ(Mega Dsc) పైన ప్రకటన ఉంటుందని చెప్పిన హామీపై చర్యలు ఏవని ధ్వజమెత్తారు. మొదటి కేబినెట్​లోనే 6 గ్రారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నకిలీవా లేక ఈ మాటలు చెప్పిన కాంగ్రెస్​ నేతలు నకిలీలా చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి వివరించగలరా అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎక్స్​ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - ఎంపీలంతా హైదరాబాద్ రావాలని కేసీఆర్ ఆదేశాలు

కర్ణాటక సీఎం వీడియోపై కేటీఆర్ ట్వీట్ - తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సిద్ధరామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.