హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే రాకతో కొత్తశోభను సంతరించుకుంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు పలువురు అభినందనలు తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏడాది పాలనపై ప్రశంసలతో ముంచెత్తారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు ప్రగతి భవన్లో కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: 'నిరుపేదలకు వేగంగా న్యాయసేవలు అందాలి'