KTR Inaugurates Narsingi Interchange : త్వరలో కోకాపేట, మల్లంపేట్‌లో ఇంటర్ ఛేంజ్‌లు వస్తాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఓఆర్ఆర్‌పై స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లకు పెంచామని తెలిపారు. ఈ క్రమంలోనే రద్దీ మేరకు సర్వీస్ రోడ్లు విస్తరించాలని సీఎం కేసీఆర్ సూచించారని స్పష్టం చేశారు. హైదరాబాద్ నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఇంటర్ ఛేంజ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
Hyderabad Outer Ring Road Interchange : ఈ సందర్భంగా శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం సివరేజ్ ట్రీట్‌మెంట్ చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని అడిగినా స్పందన లేదన్న మంత్రి.. శామీర్‌పెట్-జేబీఎస్ స్కైవాక్ కోసం రక్షణ భూములు ఇవ్వాలని అడిగామని వివరించారు. ఇందుకు రక్షణ భూములు కేటాయించి ప్రధాని మోదీ ప్రజలకు తీపి కబురు చెప్పాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామన్న కేటీఆర్.. మూసీ నదిపై 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని.. స్కైవే సైతం నిర్మిస్తామని స్పష్టం చేశారు. బీహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరిస్తామన్న మంత్రి.. ఆగస్టులో హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
''త్వరలో కోకాపేట్, మల్లంపేట్‌లో ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. రద్దీ మేరకు సర్వీస్ రోడ్లు విస్తరించాలని సీఎం సూచించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఓఆర్ఆర్‌పై 120 కి.మీ. స్పీడ్ లిమిట్ పెంచాం. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించాం. బీహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరిస్తాం. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం సివరేజ్ ట్రీట్‌మెంట్ చేస్తాం. ఆగస్టులో హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తాం.''-మంత్రి కేటీఆర్
KTR Comments PM Modi on Hyderabad Development : అనంతరం కోకాపేటలో ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.3,866 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. మురుగు నీరు పునర్వినియోగం చేసేలా త్వరలోనే పాలసీ తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో మొదటి ఎస్టీపీ కోకాపేటలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్న ఆయన.. ఎస్టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
''నగరంలో మొదటి ఎస్టీపీ కోకాపేటలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎస్టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. మురుగు నీరు పునర్వినియోగం చేసేలా త్వరలోనే పాలసీ తీసుకువస్తాం. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో మురుగు నీరు శుద్ధీకరణ పూర్తవుతుంది. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులిచ్చాం. శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తాం. మూసీపై స్కైవే నిర్మిస్తాం.'' - మంత్రి కేటీఆర్
ఇవీ చూడండి..
KTR Latest News : నేడు ఓఆర్ఆర్‌పై ఇంటర్‌చేంజ్ ప్రారంభించనున్న కేటీఆర్