KTR Comments On Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ని ఓ పోకిరి చేతుల్లో పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణించిన కేటీఆర్.. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విధంగా విమర్శలు చేశారు.
Minister KTR Fire On Revanth Reddy : అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులమంటూ గత రాత్రి సుమారు 12:15 గంటల సమయంలో కొందరు తనకు కాల్ చేసి బెదిరించినట్లు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్విటర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ట్వీట్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీని ట్విటర్ ద్వారా సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
-
I request Home Minister @mahmoodalibrs Garu and @TelanganaDGP Garu to kindly take this matter seriously and act sternly and swiftly as per law
— KTR (@KTRBRS) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It’s truly unfortunate that Scamgress now has been handed over to a thug in Telangana who is resorting to open threats https://t.co/qJWN0sS5Lw
">I request Home Minister @mahmoodalibrs Garu and @TelanganaDGP Garu to kindly take this matter seriously and act sternly and swiftly as per law
— KTR (@KTRBRS) July 14, 2023
It’s truly unfortunate that Scamgress now has been handed over to a thug in Telangana who is resorting to open threats https://t.co/qJWN0sS5LwI request Home Minister @mahmoodalibrs Garu and @TelanganaDGP Garu to kindly take this matter seriously and act sternly and swiftly as per law
— KTR (@KTRBRS) July 14, 2023
It’s truly unfortunate that Scamgress now has been handed over to a thug in Telangana who is resorting to open threats https://t.co/qJWN0sS5Lw
కేటీఆర్ Vs రేవంత్ రెడ్డి : గురువారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉచిత విద్యుత్‌పై తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను వక్రీకరించి.. కేటీఆర్ టీం ఎడిట్ చేసి తప్పుదారి పట్టించిందని రేవంత్ రెడ్డి పరుషజాలంతో విమర్శలు చేశారు. అంతకు ముందు అమెరికాలో రేవంత్ ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కేటీఆర్ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూడు గంటల విద్యుత్‌ను ఇచ్చే కాంగ్రెస్ లాంటి రాబందు కావాలో.. లేక మూడు పంటలు పండిస్తున్న కేటీఆర్ కావాలనో మీరే తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నుంచి రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక వెలువడిందని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ను ఓడించాలని తెలంగాణ ప్రజానికాన్ని కోరారు.
Revanth Reddy Comments On KCR : అందుకు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి ఉచితం అబద్ధం.. అవినీతి నిజం అని బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్‌నే.. ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని నాటి ప్రభుత్వానికి తేల్చి చెప్పారన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ పేరు చెప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని గతంలో కేసీఆర్ చెప్పారు. తక్కువ రేటుకే కేంద్రం ఇస్తామంటే వద్దని చెప్పి.. రూ.45వేల కోట్లను అప్పుగా చేసి ఇప్పుడు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి :