ETV Bharat / state

KTR Comment on Congress: 'పదేళ్లుగా అధికారంలో లేక.. కాంగ్రెస్‌ ఫ్రస్టేషన్‌లో ఉంది' - KTR comments on Priyanka Gandhi

KTR Comments on Priyanka Gandhi: ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రాజకీయ పర్యటనకు వస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆమె దీనిని ఎడ్యుకేషన్‌ టూర్‌గా మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ప్రియాంక తెలుసుకోవాలని అన్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్‌ ఫ్రస్టేషన్‌లో ఉందని ఆయన దుయ్యబట్టారు.

KTR
KTR
author img

By

Published : May 7, 2023, 7:35 PM IST

Updated : May 7, 2023, 7:48 PM IST

KTR Comments on Priyanka Gandhi: ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. సకాలంలో తెలంగాణ ఇవ్వక.. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రైవేట్ రంగంలో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ తరహాలోనే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తే ఏ ఒక్కరూ నిరుద్యోగిలా మిగిలేవారు కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. యువ సంఘర్షణ సభ పేరుతో రాష్ట్రానికి వస్తున్న ప్రియాంక గాంధీ.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ చేసిన నియామకాలు, కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, యువతకు చేసిన మంచిని చెబితే బాగుంటుందని పేర్కొన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి కేంద్రంగా ఉన్న తెలంగాణ.. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచిన విషయాన్ని.. తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా మరిచిపోలేదన్న సంగతిని ప్రియాంకగాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. 2004 కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పెట్టినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగి ఉండేవి కాదన్న సత్యాన్ని ఆమె తెలుసుకోవాలని పేర్కొన్నారు. సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఈ విషయం అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకున్న సంగతిని.. పొలిటికల్ టూరిస్ట్ ప్రియాంక గాంధీ ఈ పర్యటనలో తెలుసుకుంటారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

"రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు. రాజకీయ పర్యాటకులకు తెలంగాణ స్వాగతం చెబుతోంది
ప్రియాంక గాంధీ రాజకీయ పర్యటనకు వస్తున్నారు. ప్రియాంక పర్యటనను ఎడ్యుకేషన్‌ టూర్‌గా మార్చుకోవాలి. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ప్రియాంక తెలుసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీకి ఎంప్లాయిమెంట్ పాలసీ లేదు. ఉపాధి విధానం ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. గాంధీభవన్‌ను గాడ్సేకు ఇచ్చి కాంగ్రెస్ అంతానికి వీలునామా రాసుకుంది. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్‌ అసహనంతో ఉంది." - కేటీఆర్‌, మంత్రి

ఇవీ చదవండి: Priyanka Gandhi Hyderabad Tour : ప్రియాంక గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు.. ఆ టైమ్​కే సభ స్టార్ట్

Inhuman Incident in kamareddy : కాసుల కోసం కూతుళ్ల కక్కుర్తి.. ఏ కన్నతల్లికి రాకూడదీ దుస్థితి

పెంపుడు జంతువులకూ ఆన్​లైన్​లోనే రైలు టికెట్లు.. మెడికల్​ సర్టిఫికెట్​ కంపల్సరీ!

Last Updated : May 7, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.