రాష్ట్ర అప్పులపై పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్, భాజపాలు... మరింత అవగాహన పెంచుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తి 17 శాతం ఉన్నట్లు... లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. రాష్ట్ర అప్పులు రుణ పరిమితిలోపే ఉందని పేర్కొంటూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ఫొటోలు ఎందుకు... లాభాలు కావాలి: సీఎం కేసీఆర్