ETV Bharat / state

KTR Challenge to Telangana Congress Leaders : 'ఓఆర్ఆర్ అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'

KTR Challenge to Telangana Congress Leaders : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30 ఏళ్లకు లీజుకు ఎలా ఇస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పని గట్టుకుని విషం చిమ్మే కొన్ని పత్రికల్లో వచ్చిందే నిజమనుకుంటే ఎలా? అని సీఎల్పీ నేతను కేటీఆర్ నిలదీశారు.

KTR
KTR
author img

By

Published : Aug 5, 2023, 7:33 PM IST

KTR Challenge to Telangana Congress Leaders : హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌ రోడ్డు టోల్ లీజుపై.. తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. దివాలా తీసిన సంస్థకు ఓఆర్​ఆర్ నిర్వహణను అతి తక్కువ మొత్తానికి 30 ఏళ్లకు కట్టబెట్టారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లోనూ అదే సంస్థకు టోల్‌ వసూలు లీజు ఇచ్చారని చెప్పారు. అక్కడ కూడా అవినీతి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ఓఆర్​ఆర్ టోల్‌ లీజు వ్యవహారంలో అవినీతిని నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్‌ సవాల్ విసిరారు.

KTR Sensational Comments on Congress and BJP : దేశంలో ఇప్పుడు చాయ్ పే చర్చ కాదు.. సిలిండర్‌, నిత్యావసర ధరలపై చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమ కంటే ఉత్తమ పాలన ఉందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే ఒక మాట ఇవ్వాలన్నా.. ఒక పని చేయలన్నా.. చివరకు బాత్రూంకు పోవాలన్నా.. చలో దిల్లీ అంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దిల్లీ వదిలిన బాణాలన్న ఆయన.. తమ నాయకుడు కేసీఆర్‌.. ప్రజలు వదిలిన బ్రహ్మాస్త్రం అని అన్నారు.

KTR Speech at Assembly Sessions 2023 : 'సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత.. తప్పైతే వచ్చే ఎన్నికల్లో ఓడించండి'

'కాంగ్రెస్ అంటేనే అంధకారం. పీసీసీ అధ్యక్షుడు ఏది మాట్లాడినా రూ.వేల కోట్ల కుంభకోణం అంటారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఐ కొందరికి రూట్ టు ఇన్‌కం. రేవంత్ మాటలు సంస్కారం ఉన్న నాయకుని మాటలా? 70 ఏళ్లు ఉండి.. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ను ఉరి వేసి రాళ్లతో కొట్టమంటారా? ఐఏఎస్‌ అధికారులను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? పరువు నష్టం దావాతో మీ అధ్యక్షుడి అంతు చూస్తాం. ఐఆర్‌బీ సంస్థ రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర చోట్ల కూడా ఇదే తరహాలో లీజు తీసుకుంది. అక్కడ కూడా కుంభకోణాలు జరిగాయా? ఓఆర్‌ఆర్‌ యాజమాన్య హక్కులు వదులుకోవడం లేదు. 30 ఏళ్ల తర్వాత భట్టి ముఖ్యమంత్రిగా ఉంటారేమో?ఓఆర్‌ఆర్‌ టెండర్ల వ్యవహారంలో తప్పు చేసినట్లు నిరూపిస్తే మళ్లీ ఏ పదవీ తీసుకోను. రాజకీయ సన్యాసం తీసుకుంటా.'-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

పదవుల కోసం నీచ రాజకీయాలు చేయం : పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం బీఆర్​ఎస్​కు లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఛాయిస్‌ ప్రజల ముందు ఉందన్న ఆయన.. తాము చెప్పింది తప్పు అయితే శిక్షించండి.. ఓడించండని విజ్ఞప్తి చేశారు. కంటెంట్‌ లేని కాంగ్రెస్‌కు.. కమిట్‌మెంట్‌ ఉన్న కేసీఆర్‌కు పోలికా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2023 మార్చి వరకు పంచాయతీల అన్ని బిల్లులు క్లియర్ అయ్యాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా పూర్తిచేసితీరతామని... ప్రజాశీర్వాదంతో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

'తెలంగాణ పైసలతో భావిభారత నిర్మాణం జరుగుతుందంటే మనందరికీ గర్వకారణం. ప్రజాశీర్వాదంతో అధికారంలో ఉన్నాం.. కాదంటే ఇంటికెళ్తాం. నూటికి నూరుశాతం మూడోసారి మేమే అధికారంలోకి వస్తాం. మళ్లీ మేమే వస్తాం.. మెట్రో విస్తరణను మేమే పూర్తి చేస్తాం. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదు. కేంద్ర భూములు ఇస్తే.. రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తాం. మత రాజకీయాలకు అన్నిసార్లు ఓట్లు పడతాయని అనుకోవద్దు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేశాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రేవంత్‌ రెడ్డి అంతుచూస్తాం'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

KTR on Telangana IT Development : 'తెలంగాణ వచ్చాక 6 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలొచ్చాయి'

Telangana Assembly Sessions 2023 : అసెంబ్లీ సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశాలు.. ఈటల, జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు

KTR Instructions to BRS Leaders : 'మెట్రో విస్తరణ నియోజక వర్గాల్లో సంబరాలు నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.