ETV Bharat / state

Saidabad Incident: చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్​ - SAIDABAD RAPE CASE updates

నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని వెల్లడించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పినట్లు తెలిపారు.

Saidabad Incident
Saidabad Incident: చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్​
author img

By

Published : Sep 16, 2021, 11:39 AM IST

Updated : Sep 16, 2021, 12:13 PM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య (ACCUSED RAJU SUICIDE ) చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్డడం సహా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు.. విస్తృతంగా ప్రచారం జరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మృగం చనిపోయింది

నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ (MINISTER KTR) ట్విటర్​ ద్వారా వెల్లడించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయినట్లు​ ట్విటర్​ వేదికగా తెలిపారు. జనగామ జిల్లాలోని స్టేషన్​ ఘన్​పూర్​ రైల్వే ట్రాక్​పై మృతదేహాం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు.

చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పారు.

- మంత్రి కేటీఆర్ ట్వీట్​

ట్విటర్​ వేదికగా డీజీపీ

సైదాబాద్ ఘటన నిందితుడి మృతదేహం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి (DGP) ట్విటర్​ వేదికగా తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహం గుర్తించినట్లు పేర్కొన్నారు.

మృతదేహంపై ఆనవాళ్ల ఆధారంగా రాజుగా గుర్తించినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్ (CP ANJANI KUMAR) చెప్పారు. ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మిగతా దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

ముందుగా గమనించిన కార్మికులు

స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌ రైల్వేట్రాక్‌ సమీపంలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. స్టేషన్‌ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద.. అతను సంచరించినట్లు రైల్వే కార్మికులు తెలిపారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడినట్లు చెప్పారు. రాజు మృతదేహాన్ని ముందుగా గమనించిన కార్మికులు... డయల్‌ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు . ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అతని చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సైదారాబాద్‌ అత్యాచార నిందితుడు రాజు అని నిర్ధరించారు.

విస్తృతంగా తనిఖీలు

సైదారాబాద్‌ అత్యాచార నిందితుడు రాజు... ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాజు కోసం రైల్వే ట్రాక్‌లపై గాలించిన పోలీసులు.. రైలు ప్రమాద ఘటనల్లో చనిపోయిన గుర్తుతెలియని మృతుల వివరాలు పరిశీలించారు. అనంతరం మార్చురీల్లో భద్రపరిచిన రైలు ప్రమాద మృతదేహాలను... క్షుణ్ణంగా పరిశిలీంచారు. గాలింపు ముమ్మరం కావడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అతడి ఫోటోలు విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆత్మహత్య చేసుకుంటాడనని పోలీసులు అనుమానించారు. ఈ తరుణంలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌ స్టేషన్‌ రైల్వేట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైంది.

ఇదీ చూడండి: Saidabad Incident: రైల్వేట్రాక్​పై సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం

Last Updated : Sep 16, 2021, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.