ETV Bharat / state

బీజేపీ మూగ ట్రోల్స్.. మీరు చేసిన అభివృద్ధి శూన్యం అని గ్రహించాలి: కేటీఆర్ - KTR congratulates set up trauma center on ORR

KTR Tweet Today : బీజేపీపై మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌లో 2,000 బెడ్ల కెపాసిటితో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ అభివృద్ధి ఆ పార్టీకి కనిపించదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు

KTR
KTR
author img

By

Published : Jan 8, 2023, 7:43 PM IST

KTR Tweet Today: మంత్రి కేటీఆర్ బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. వరంగల్‌లో 2,000 బెడ్ల కెపాసిటీతో తెలంగాణలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 24 అంతస్థులతో నిర్మితమయ్యే ఈ ఆస్పత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనని తెలిపారు. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఈ అభివృద్ధి బీజేపీకి కనిపించదని ఎద్దేవా చేశారు. బీజేపీ మూగ ట్రోల్స్.. మీరు ఈ ఆస్పత్రి అభివృద్ధికి చేసింది శూన్యం అన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • Before some Dumb BJP trolls start making silly claims, let me assure you that the contribution of Govt of India to this hospital is ZERO https://t.co/Cd1sJ1IiOD

    — KTR (@KTRTRS) January 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్‌ఆర్‌పై ట్రామా సెంటర్లు ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏను కేటీఆర్ అభినందించారు. గతేడాది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. 1098 మందికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడారని కొనియాడారు. ట్రామా కేర్ బృందాలకు సైతం అభినందనలు తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ఏదైనా ప్రమాదం జరిగితే 14449 అనే టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే.. సమీపంలో ఉన్న అంబులెన్స్ ట్రామా సెంటర్లకు తక్షణమే తీసుకెళ్లి చికిత్స అందేలా చూస్తున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: 'రూ.1,000 కోట్ల భూకుంభకోణాన్ని బయటపెట్టాను.. కేటీఆర్​ సార్​ మీరే నన్ను కాపాడాలి'

'జయలలిత మృతికి మోదీనే కారణం'.. డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.