హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం ముగిసింది. కన్వీనర్ ఆర్కే పిళ్లై నేతృత్వంలో కమిటీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కానీ తెలంగాణ నుంచి ఎవరూ హాజరు కాలేదు. భేటీకి గైర్హాజరీ విషయమై ఆర్ఎంసీకి తెలంగాణ లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్ రూల్‌కర్వ్స్, జల విద్యుదుత్పత్తి అంశాలపై చర్చించారు. నివేదికపై ఏపీ సభ్యుల సంతకాలను ఆర్ఎంసీ తీసుకుంది. ఆర్ఎంసీ... కేఆర్ఎంబీకి నివేదిక సమర్పించనుంది.
''ఆర్ఎంసీ భేటీలో నివేదికపై సంతకం చేశాం. తెలంగాణ సభ్యులు హాజరైతే కొన్ని కొలిక్కి వచ్చేవి. శ్రీశైలం, సాగర్ నిర్వహణపై విధానాలు కొలిక్కి వచ్చేవి. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తిలోనూ ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత వచ్చేది. శాశ్వత ఆర్ఎంసీ కూడా ఏర్పాటు అయ్యేది. ప్రస్తుత ఆర్ఎంసీ కొనసాగుతోందా లేదా అనేదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.'' -ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి
ఇవీ చూడండి: