ETV Bharat / state

KRMB committee Meet: నేడు కేఆర్‌ఎంబీ కమిటీ భేటీ.. వాటిపైనే మరోసారి చర్చ - కేఆర్‌ఎంబీ

KRMB committee Meet: నేడు కేఆర్‌ఎంబీ కమిటీ మరోసారి భేటీ కానుంది. వరదనీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై మరోమారు సమావేశంలో చర్చించనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా కమిటీ సమావేశం ఇవాళ జరగనుంది.

KRMB
KRMB
author img

By

Published : Aug 4, 2022, 5:38 AM IST

KRMB committee Meet: జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన సహా వరదనీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది. ఇటీవల జరిగిన జలాశయాల నిర్వహణా కమిటీ సమావేశంలో రూల్ కర్వ్స్ విషయమై చర్చించారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటికి అనుగుణంగా మరోమారు సమావేశం కావాలని గతంలో నిర్ణయించారు.

అందుకు అనుగుణంగానే ఇవాళ కమిటీ మరోమారు భేటీ కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా కమిటీ సమావేశం కానుంది. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్లై కన్వీనర్​గా ఉన్న కమిటీలో బోర్డు సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు వెంకటరాజం, సృజయకుమార్ ఉన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్​లో విద్యుత్ ఉత్పత్తి కోసం విధివిధానాలు, రూల్ కర్వ్స్, వరదజలాల లెక్కింపు అంశాలపై కమిటీ చర్చించనుంది.

ఇవీ చదవండి: వీఆర్వోల సర్దుబాటుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ..

దీదీ సర్కార్​ దిద్దుబాటు చర్యలు.. కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ.. బాబుల్​ సుప్రియోకు చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.