జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండి యోగా చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రముఖ మాజీ కేంద్ర మంత్రి, సినీ నటులు కృష్ణంరాజు దంపతులు కోరారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన సతీమణితో కలిసి పలు యోగాసనాలు వేశారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని కరోనా బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు పది నుంచి పదిహేను నిమిషాల పాటు యోగా చేస్తే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల