కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) 14వ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి సింగ్ అధ్యక్షతన.. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా 13 అంశాలపై చర్చ జరగనుంది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి, గోదావరి జలాల మళ్లింపుపై చర్చిస్తారు. చిన్న నీటి వనరులు, తాగునీటి లెక్కింపులు, బోర్డు తరలింపు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డు నిర్వహణపై చర్చ జరగనుంది. ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులపైనా సమావేశంలో చర్చకు రానుంది. సాయంత్రం 4 గం.కు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరగనుంది.
ఇదీ చదవండి: Rajath kumar: 'కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది'