Krishna RMC meeting On 24th This Month: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలశాయాల పర్యవేక్షక కమిటీ - ఆర్ఎంసీ చివరి సమావేశం ఈనెల 24న జరగనుంది. గతంలో నిర్ణయించిన మేరకు 24న కమిటీ ఆరో, చివరి సమావేశం నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చింది. జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ, వరదజలాలు, రూల్ కర్వ్స్ మార్గదర్శకాల ఖరారు కోసం ఆర్ఎంసీని బోర్డు ఏర్పాటు చేసింది.
గతంలో కమిటీ సమావేశమై కొన్ని అంశాలపై చర్చించింది. అయితే గత రెండు సమావేశాలకు రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు. దీంతో ఇప్పటి వరకు చేసిన కసరత్తు ఆధారంగా రూపొందించిన నివేదిక ఖరారు.. దానిపై సంతకాలు చేసేందుకు చివరి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎంసీ తెలిపింది. గతంలో అంగీకరించిన సిఫార్సులను కూడా సమావేశంలో సమీక్షించుకొని మరలా ఏకాభిప్రాయానికి రావచ్చని పేర్కొంది. ఒకవేళ చివరి సమావేశానికి ఏ రాష్ట్రానికి సంబంధించిన సభ్యులు రాకపోయినా, భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్ఎంసీ విఫలమైనట్లు భావించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇదే విషయాన్ని బోర్డుకు నివేదించాలని నిర్ణయించింది.
ఇవీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు
ఒంటి కాలితో 2లక్షల కి.మీ సైక్లింగ్.. క్యాన్సర్‌ను, వైకల్యాన్ని ఎదిరించిన రాజు