ETV Bharat / state

'కృష్ణా జలాల్లో 50% వాటా కేటాయించాల్సిందే' - ఈ నెల 11న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

Telangana Demands in KRMB Meeting: కృష్ణా జలాలపై పోరుకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 11న జరగనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి రెండు రాష్ట్రాలు తమ డిమాండ్​లను అందజేశాయి. కృష్ణా జలాల్లో 50% వాటా కేటాయించాల్సిందే అన్న డిమాండ్​ను తెలంగాణ ప్రధానంగా పేర్కొంది.

KRMB Meeting
KRMB Meeting
author img

By

Published : Jan 6, 2023, 7:07 AM IST

Telangana Demands in KRMB Meeting: కృష్ణా జలాలపై పోరుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమయ్యాయి. ఈ నెల 11న జరగనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి రెండు రాష్ట్రాలు తమ ఎజెండాలను అందజేశాయి. వాటిపై బోర్డు కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ఎజెండాలో.. కృష్ణా జలాల్లో 50 శాతం వాటాను ప్రధానంగా పేర్కొనగా.. గోదావరి జలాల మళ్లింపుతో నాగార్జునసాగర్‌ ఎగువన వినియోగించుకునే వెసులుబాటున్న 45 టీఎంసీల నీటిని తెలంగాణ కేటాయించుకోవడం చెల్లదని ఏపీ ప్రస్తావించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారంటూ రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. ఏపీకి బోర్డు తరలింపు, నిర్వహణకు రెండు రాష్ట్రాల నిధుల కేటాయింపు, అదనపు సిబ్బంది తదితర అంశాలు కూడా ఉండనున్నాయి.

తెలంగాణ అంశాలివీ..

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 50 శాతం వాటా కేటాయించాలి. 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన నీటి పంపిణీ ఒప్పందం తాత్కాలికమైనది. ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున (66:34 నిష్పత్తితో) జరిగిన పంపిణీ ఒప్పందం ఆ సంవత్సరానికే పరిమితం. దీని కొనసాగింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. దీనిపై పలుమార్లు బోర్డుకు, కేంద్ర జల సంఘానికి లేఖలు రాశాం. నదీ పరీవాహకాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో బేసిన్‌ పరిధిలో ఆయకట్టు అవసరాలను గుర్తించాలి.

ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోని నీటిని మరుసటి ఏడాదిలో వినియోగానికి (క్యారీ ఓవర్‌) అనుమతి ఇవ్వాలి. దీనివల్ల ముందుగా సాగునీరు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది.

హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్నే లెక్కలోకి తీసుకోవాలి.

కృష్ణా ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటి వినియోగాన్ని పక్కాగా లెక్కించేందుకు రియల్‌ టైం డేటా సెన్సర్లు (టెలిమెట్రీ) ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులు, కాలువల నుంచి విడుదలవుతున్న నీటి వివరాలను బోర్డు రికార్డు చేయాలి.

కర్ణాటక- కర్నూలు సరిహద్దులోని రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) కుడి వైపు అనుమతులు లేకుండా ఏపీ నిర్మిస్తున్న కాలువ పనులను అడ్డుకోవాలి. ఇప్పటికే హెడ్‌వర్క్స్‌కు సంబంధించిన పలు నిర్మాణాలను చేపట్టింది. ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణ పనుల పూర్తికి బోర్డు కృషి చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌వి..

నాగార్జునసాగర్‌ వెనుక జలాలను ఎత్తిపోసేందుకు రూ.1450 కోట్లతో తెలంగాణ చేపట్టిన సుంకేశుల ఇంటెక్‌ వెల్‌ ప్రాజెక్టుకు అనుమతులు లేవు. ఈ పనులను అడ్డుకోవాలి.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్‌, కేఆర్‌ఎంబీ నుంచి అనుమతులు లేకుండానే నిర్మిస్తోంది.

మైనర్‌ ఇరిగేషన్‌లో 45 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ.. తెలంగాణ 175 టీఎంసీల వరకు వాడుకుంటోంది.

గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీలలో ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం నాగార్జునసాగర్‌ ఎగువన 45 టీఎంసీలు వినియోగించుకోవాలనేది ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం. ఆ నీటిని తెలంగాణ మళ్లింపు చేసుకుంటామని ఉత్తర్వులు జారీ చేయడం సరైనది కాదు.

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి రాష్ట్రంలో 25 టీఎంసీల కేటాయింపు ఉంది. దీనికి అదనంగా మరో 15 టీఎంసీలను తెలంగాణ కేటాయించుకోవడం సరికాదు. జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) నివేదికను బోర్డు అమలు చేయాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.