ETV Bharat / state

నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

నిన్న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేటికి వాయిదా పడింది. జలసౌధ వేదికగా బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

krishna board meeting at hyderabad
నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
author img

By

Published : Jan 9, 2020, 5:26 AM IST

Updated : Jan 9, 2020, 8:04 AM IST

బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేడు జరగనుంది. నిన్న జరగాల్సిన భేటి వాయిదా పడగా... దానిని నేడు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పాల్గొంటారు. కేంద్ర జల్​శక్తి మంత్రిత్వశాఖ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. బోర్డు ప్రధాన కార్యాలయం తరలింపు, జలాల సరిహద్దులతో పాటు ప్రధానంగా 4 అంశాలను చర్చింనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమీక్షలో ప్రధానమైన 4 అంశాలతో పాటు కొత్తగా రెండు అంశాలను రెండు రాష్ట్రాలు లేవనెత్తే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చెన్నై తాగునీటి విడుదల అంశాన్ని కూడా బోర్డు పరిధిలోకి చేర్చాలని... తెలంగాణ వరదల సమయంలో వినియోగించుకుంటున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని... ఏపీ బోర్డు ఛైర్మన్​ అనుమతితో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అజెండాలో చేర్చిన కేఆర్​ఎంబీకి నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీ, 10వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తీర్మానం. బోర్డును ఏపీ రాజధానికి తరలింపు వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఇవీ చూడండి: పార్టీ మారనని బాండ్​ రాసిస్తేనే బీ ఫారం...!

File : TG_Hyd_02_09_Krishna_Board_Meeting_Dry_3053262 From : Raghu Vardhan ( ) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. నిన్న జరగాల్సిన భేటీ చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఇవాళ హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు సమావేశం కానుంది. బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగే సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పాల్గొంటారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు, కృష్ణా బోర్డు నిర్వహణా నియమావళి, బడ్జెట్, బోర్డు విజయవాడకు తరలింపు తదితర అంశాలపై చర్చిస్తారు. దీంతో పాటు మరో రెండు అంశాలపై అదనంగా చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. గృహ వినియోగం కోసం తీసుకున్న నీటిని 20 శాతం మాత్రమే పరిగణించాలన్న ట్రైబ్యునల్ తీర్పును పాటించడం లేదని తెలంగాణ పేర్కొంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీరు తరలిస్తున్నందున ఆమేరకు తెలంగాణకు 45 టీఎంసీల నీరు అదనంగా ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా బోర్డు సమావేశంలో చర్చించాలని ప్రతిపాదించింది. సాగర్ ఎడమ కాల్వ ద్వారా కింది పొలాలకు నీరు రావడం లేదని... సంబంధించిన అంశాలపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అటు ఈ నెల 21వ తేదీన కేంద్రజలవనరుల శాఖ నిర్వహించనున్న సమావేశం విషయమై కూడా బోర్డు భేటీలో చర్చ జరగనుంది. ఈ నెల 21న దిల్లీలో జరగనున్న సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల సంబంధిత అంశాలపై కేంద్ర జలవనరుల శాఖ చర్చించనుంది.
Last Updated : Jan 9, 2020, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.