చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. తెరాస పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎన్ని సార్లు లేఖలు ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. హైదరాబాద్లో మీట్ ది ప్రెస్లో ఆయన ఈ ఆరోపణలు చేశారు. 'సరే సార్... జీ హుజూర్... అనే వాళ్లే తెరాసలో ఉండగలుగుతారు కానీ ప్రజాపక్షాన నిలబడి ప్రశ్నించే వాళ్లు అక్కడ ఉండలేరు' అని అన్నారు. అధికార పార్టీలో ఉండి చాలా సమస్యలపై అంతర్గతంగా పోరాడినట్లు తెలిపారు. గొడవ చేస్తే పార్టీ పరువు పోతుందనే గులాబీ దళాన్ని వదిలినట్లు కొండా వెల్లడించారు.
ఇవీ చదవండి: '1 కాదు... 5 వీవీప్యాట్ రసీదులు లెక్కించండి'