కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వం, మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. తనిఖీల్లో 10 లక్షలు మాత్రమే దొరికితే వాటిని 15 కోట్లని చెప్పి మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పు చేశారని నిరూపిస్తే ముక్కు నేలకి రాస్తామని దాసోజు సవాల్ విసిరారు. తెరాస నేతలు చేయించిన సర్వేలో తన గెలుపు తథ్యమని తెలిసి తట్టుకోలేకే ఇలా చేస్తున్నారని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తనపై ఎవరు ఎన్ని నిందలు మోపినా చేవెళ్ల ఎంపీగా తన గెలుపును ఆపలేరన్నారు. అంతకు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ని కలిసి అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: మట్టి దిబ్బ కూలి పది మంది మృతి