అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి అడ్డుపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
"నేను కేసీఆర్ బొమ్మతో గెలవలేదు. ప్రజలు గెలిపిస్తే ఇక్కడికి వచ్చాను. మాట్లాడే గొంతును నొక్కేస్తున్నారు. తొలిగా నేను మాట్లాడుతానని సీఎల్పీ జాబితా ఇచ్చింది. సభలో మాట్లాడే విషయంలోనూ అన్యాయం చేశారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచారు. పురపాలిక ఎన్నికల్లో మేము గెలిచినచోట కూడా మీవాళ్లే ఛైర్‌పర్సన్‌లు అయ్యారు? ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు అధికార పక్షాలు అడ్డుతగలొద్దు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..!" రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని అని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: నేరాలకు మద్యమే కారణం: సీతక్క