తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేదెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబపాలన చేస్తూ దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పాల్పడుతున్న చర్యలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, రాబోయే రోజుల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి: 'ఇది కాంగ్రెస్‌దే కాదు... నాలుగు కోట్ల ప్రజల సమస్య'