ETV Bharat / state

'పంటనష్టంపై సర్వే చేయించండి'

రబీ పంటలు చేతికొచ్చే సమయంలో లాక్‌డౌన్‌ అమలులోకి రాగా రైతులు ఆ పంటలు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని కిసాన్‌ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

'పంటనష్టంపై సర్వే చేయించండి'
'పంటనష్టంపై సర్వే చేయించండి'
author img

By

Published : Sep 29, 2020, 2:39 PM IST

తెలంగాణలో వర్షాల కారణంగా జరిగిన పంటనష్టంపై వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించాలని కిసాన్‌ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ సర్వే వివరాలపై తక్షణమే మంత్రి మండలిని ఏర్పాటు చేసి చర్చించి పరిహారం ప్రకటించాలని కోరారు.

తీవ్ర నష్టం...

రబీ పంటలు చేతికొచ్చే సమయంలో కరోనాతో లాక్‌డౌన్‌ అమలులోకి రాగా రైతులు ఆ పంటలు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అతి కష్టం మీద తక్కువ ధరలకే తమ పంటలను అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోయారు. ఇప్పడేమో... రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు అన్ని నిండాయని పంటలు కూడా భారీగా నష్టపోయినట్లు తెలిపారు.

ఆదుకోండి...

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని జీవోలు ఉన్నాయని... అయినా అవి అమలుకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవడానికి యూపీఏ ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, కాని భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారం చెల్లించే విధానం అమలు కావడం లేదని ఆరోపించారు. కిసాన్ కాంగ్రెస్ అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సమస్యలపై విన్నవించినా... ఏలాంటి ప్రయోజనం లేదని వాపోయారు.

ప్రధానితో సహా పలువురు మీడియా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. గతంలో నోట్ల రద్దుతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని, ఇవాళ్టికి కూడా ఇబ్బందులు పోలేదన్న ఆయన బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని విమర్శించారు.

ఇదీ చూడండి: రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.