బహుళజాతి సంస్థల కోసం పేదల భూములను అన్యాయంగా లాక్కొంటున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. షాబాద్ మండలంలో పరిశ్రమల స్థాపన కోసం జరుగుతున్న భూసేకరణపై సీఎస్ జోషికి కోదండరాం ఫిర్యాదు చేశారు. గ్రామస్థులను సంప్రదించకుండానే భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల వద్ద తక్కువ ధరకు స్థలాలు తీసుకొని, టీఎస్ఐఐసీ ఎక్కువ ధరకు పరిశ్రమలకు విక్రయిస్తోందని కోదండరాం ఆరోపించారు.
ప్రస్తుతం సచివాలయం సకల సౌకర్యాలతో అందరికి అందుబాటులో ఉందని తరలింపు, కూల్చివేత ప్రక్రియను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం