ETV Bharat / state

'సింహయాజీని కలిసిన మాట వాస్తవం.. అందులో రాజకీయకోణం ఏముంది..?' - Simhayaji latest news

సింహయాజీని కలవడంపై కోదండరాం వివరణ ఇచ్చారు. ఆరు నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. రాజకీయ జీవితంలో అనేక మందిని కలుస్తుంటామని.. అలాగే సింహయాజీని కలవడంలో ప్రత్యేకత ఏమీ లేదని తెలిపారు.

Kodandaram
Kodandaram
author img

By

Published : Dec 1, 2022, 5:14 PM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన సింహయాజీని కలిసినట్లు వస్తున్న ప్రచారాలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టతనిచ్చారు. తాను 6 నెలల క్రితం కలిసింది నిజమేనని చెప్పారు. కానీ అందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. కేవలం ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే ఆయనను కలిశానని వెల్లడించారు. రాజకీయ జీవితంలో అనేక మందిని కలుస్తుంటామని పేర్కొన్నారు.

సింహయాజీని తిరుపతికి చెందిన స్వామిజీగా తనకు పరిచయం చేశారని అన్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక గురువు సింహయాజీని కలిశానని తెలియజేశారు. సింహయాజీకి రాజకీయాలతో సంబంధమున్నట్లు ఇప్పుడే తెలుస్తోందన్నారు. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

"నేను సింహయాజీని కలిసినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 6 నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవం.తిరుపతికి చెందిన స్వామీజీగా సింహయాజీని పరిచయం చేశారు. రెండు మూడు రోజులు తరువాత ఆయనను కలిశాను.తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువంటే కలిశాను. ఆధ్యాత్మిక గురువంటే కలిశాను తప్ప వేరే కోణం లేదు. సింహయాజీకి రాజకీయాలతో సంబంధమున్నట్లు ఇప్పుడే తెలుస్తోంది. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. - కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు

సింహాయాజిని కలవడంలో రాజకీయకోణం లేదన్న కోదండరాం

అసలేం జరిగిదంటే: ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ అధికారులు నిన్న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. ఇప్పటివరకు జాబితాలో లేని కొత్త పేర్లను అధికారులు ప్రస్తావించారు. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు అందుకున్న వారి జాబితాను పేర్కొన్నారు. నిందితులతో అనుమానితుల కాల్ డేటాను న్యాయస్థానానికి సమర్పించారు. కీలక నేతలతో నిందితులు దిగిన ఫొటోలను.. వారు ప్రయాణించిన విమాన టికెట్ల వివరాలు సిట్ అధికారులు సేకరించారు. కోదండరాంను బీజేపీలోకి మార్చేందుకు సింహయాజీ ప్రయత్నించారని తెలియజేశారు. ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు దామోదర ప్రసాద్, ముంజగల్ల విజయ్‌ను బీజేపీలోకి మార్చేందుకు ప్రయత్నించారని సిట్‌ అధికారులు కౌంటర్​లో వివరించారు.

ఇవీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ అధికారుల కౌంటర్.. అందులో ఏముందంటే..

షర్మిల బీజేపీ వదిలిన బాణం: వినోద్‌ కుమార్‌

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్​ తొలి దశ సమరం.. ఈవీఎంల్లో ప్రజా తీర్పు నిక్షిప్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.