హైదరాబాద్ నాంపల్లిలో తెరాస భవన్లో సమావేశమైన అఖిలపక్ష నాయకులు పలు అంశాలపై చర్చించారు. ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా... సీఎంకు లాక్‌డౌన్ నిబంధనలు గుర్తుకొస్తాయి.. కానీ అధికార పార్టీ చేస్తే మాత్రం గుర్తుకురావని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతురాజ్యం ముసుగులో రాచరిక పాలన సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామని.. తాము ప్రభుత్వ బెదిరింపులకు భయపడం అని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల మేరకు కరోనా పరీక్షలు చేయాలన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలు మొదలవడం వల్ల ప్రజలు పెద్దఎత్తున బయటకు వస్తున్నారని కోదండరాం అన్నారు. రెడ్జోన్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని... పేదల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష