ETV Bharat / state

Kodandaram: 'తెజసను ఇతర పార్టీల్లో విలీనం చేసే ఆలోచన లేదు' - ts news

Kodandaram: తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేసే యోచనలో లేమని పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా జలాల పరిరక్షణ, విద్యుత్‌ ఛార్జీల పెంపు తదితరాలపై పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు. త్వరలో రైతురక్షణ పేరిట యాత్ర చేపడతామన్నారు.

Kodandaram: 'తెజసను ఇతర పార్టీల్లో విలీనం చేసే ఆలోచన లేదు'

author img

By

Published : Mar 28, 2022, 5:47 PM IST

Kodandaram: కేసీఆర్ అసమర్థపాలనే విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో విచిత్ర ప్రకటనలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ నెల 26న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశ వివరాలను నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ వెల్లడించారు. ఏప్రిల్‌ 9న తెజస కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.

'తెజసను ఇతర పార్టీల్లో విలీనం చేసే ఆలోచన లేదు'

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతోపాటు విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నామని కోదండరాం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా జలాల పరిరక్షణ, విద్యుత్‌ ఛార్జీల పెంపు తదితరాలపై పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు. రైతు రక్షణ పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామన్నారు. పార్టీ విలీనం గురించి చర్చ జరగలేదని కోదండరాం స్పష్టం చేశారు.

దానిపై చర్చ జరగలేదు..

'పోడు సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రైతు రక్షణ పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించాం.పెద్ద మొత్తంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇదే తొలిసారి. ప్రభుత్వ అసమర్థత వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో పడింది. ధాన్యంపై కేంద్రం, రాష్ట్ర కూర్చొని మాట్లాడుకోవాలి. పరస్పర ఆరోపణలతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఏప్రిల్ 9న మా కార్యాచరణ ప్రకటిస్తాం. కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమాలు చేస్తాం. పార్టీ విలీనం గురించి చర్చలు జరగలేదు.' -కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.