ముంబైలోని తలోజా జైలులో ఉన్న ప్రముఖ కవి, సామాజిక ఉద్యమకారుడైన వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఆయన్ను వెంటనే బెయిల్పై విడుదల చేయాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు తెజస అధ్యక్షులు కోదండరాం విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన, అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన తెలంగాణ వాది ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్య చికిత్స అందించేందుకు అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాలని కోదండరాం కోరారు.
ఇదీ చూడండి: తెలంగాణలో 36 వేలు దాటిన కరోనా కేసులు, 365కి చేరిన మృతుల సంఖ్య