ETV Bharat / state

రాజ్యసభకు కేకే, సురేశ్​ రెడ్డి ఏకగ్రీవం

author img

By

Published : Mar 18, 2020, 3:52 PM IST

Updated : Mar 18, 2020, 8:08 PM IST

KK, Suresh Reddy unanimously elected to Rajya sabha

15:48 March 18

రాజ్యసభకు కేకే, సురేశ్​ రెడ్డి ఏకగ్రీవం

రాజ్యసభకు కేకే, సురేశ్​ రెడ్డి ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యులుగా తెరాస నేతలు కె.కేశవరావు, కేఆర్ సురేశ్​  రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు జరిగిన ఎన్నికలకు కేకే, సురేశ్​ రెడ్డితో పాటు శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజ్ రాజ్ కోయల్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపాదకులు లేకపోవడం వల్ల జాజుల భాస్కర్, భోజ్ రాజ్​ల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.  

            ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం వల్ల.. కేకే, సురేశ్​ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నరసింహాచార్యులు నుంచి ఎన్నిక ధ్రువ పత్రాలను అందుకున్నారు. మంత్రులు హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితులు హాజరై కేకే, సురేశ్​ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రాజ్యసభలో గళం విప్పుతామని కేకే, సురేశ్​ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:పదికి సన్నద్ధం... కరోనా నేపథ్యంలో అప్రమత్తం

Last Updated : Mar 18, 2020, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.