kishan reddy on Mann Ki Bath: వచ్చే ఏప్రిల్ నెలలో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి వాడ, బస్తీలో ప్రజలందరూ వీక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ కవాడిగూడ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్ గగన్ మహల్‌లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజలతో కలిసి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 98వ భాగం పూర్తయిందని వచ్చే ఏప్రిల్ నెలలో జరిగే మన్ కీ బాత్ కార్యక్రమం 100 వ ఎపిసోడ్కు చేరుకుంటుందని తెలిపారు. ప్రజలకు ఎంతో ప్రేరణ నిచ్చే కార్యక్రమాన్ని ప్రపంచంలో ఏ దేశాధినేత ఇలా ఇన్నేళ్ల పాటు ప్రజలతో మాట్లాడలేదన్నారు. దేశంలో జరిగే ఎన్నో సంఘటలను దృశ్యాల రూపంలో చూపిస్తూ దేశ ప్రజలలో స్ఫూర్తి నింపే కార్యక్రమంగా కిషన్ రెడ్డి వివరించారు.
"భారత ప్రధామంత్రి నరేంద్రమోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లడేటటువంటి కార్యక్రమమైన మన్ కీ బాత్ ఈ రోజుతో 98వ భాగం పూర్తయింది. వచ్చే ఏప్రిల్ నెలతో వంద రోజులను పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశ అధినేత ఇటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. వరుసగా క్రమం తప్పకుండా ఇన్నిరోజుల పాటు మన్ కీ బాత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వచ్చే ఏప్రిల్నెలలో చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తప్పకుండా వీక్షించాలి". -జి కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: