ETV Bharat / state

వేల కోట్లు ఎక్కడ ఖర్చుచేశారు: కిషన్​రెడ్డి - kishan reddy allegations on trs government

ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్​ ఎన్నికల్లో భాగంగా సోమవారం.. తార్నాక డివిజన్​ లాలాపేటలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

kishanreddy
వేల కోట్లు ఎక్కడ ఖర్చుచేశారు: కిషన్​రెడ్డి
author img

By

Published : Nov 24, 2020, 7:05 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తార్నాక డివిజన్​ లాలాపేటలో పర్యటించారు. భాజపా అభ్యర్థి బండ జయసుధరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ రామ్​చందర్​రావుతో కలసి ప్రచారం నిర్వహించారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను ఇప్పుడే నిర్వహించి... పేదలకు వరద సాయం అందకుండా అడ్డుకున్నారని విమర్శించారు. వరదసాయం పంపిణీలోనూ అవకతవకలు జరిగాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. గ్రేటర్​ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ధీమావ్యక్తం చేశారు.

లాలాపేటలో బండ కార్తికరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు భాజపాలో చేరారు. వారందరికీ కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వేల కోట్లు ఎక్కడ ఖర్చుచేశారు: కిషన్​రెడ్డి

ఇవీచూడండి: 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.