ETV Bharat / state

కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఆమ్రపాలి..! - ఓఎస్డీగా ఆమ్రపాలి

రాష్ట్రంలో అధికారుల శాఖలను కేంద్రం మార్పు చేయనుంది. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేషీలో ముగ్గురు తెలంగాణ అధికారులు పని చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి.

కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఆమ్రపాలి..!
author img

By

Published : Jul 13, 2019, 5:01 AM IST

Updated : Jul 13, 2019, 7:17 AM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేషీలో ముగ్గురు తెలంగాణ అధికారులు పని చేయనున్నారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్​లుగా ఉన్న ఆమ్రపాలిని ఓఎస్డీగా, శశికిరణాచారిని హైదరాబాద్​లో అదనపు ప్రైవేటు కార్యదర్శిగా డిప్యూటేషన్​పై పంపాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఐపీఎస్ అధికారి ఉత్తర మండల డీసీపీ అంబర్ కిశోర్ ఝాను ప్రైవేటు కార్యదర్శిగా నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్​ల పేర్లను పరిశీలించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి : 'పారిశ్రామిక కారిడార్లతో తెలంగాణకు కొత్త రూపు'

Intro:Body:Conclusion:
Last Updated : Jul 13, 2019, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.