ETV Bharat / state

Kishanreddy Fires on CM KCR : 'ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి.. కేసీఆర్‌ సీఎం పీఠం ఎక్కారు'

Kishanreddy Fires on BRS Govt : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్​ఎస్ ప్రభు్త్వం నెరవేర్చలేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్రప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే విషయం విష ప్రచారంగా కొట్టిపారేసిన కిషన్​రెడ్డి.. ఇప్పటివరకు పొత్తులు, ఒప్పందాలు బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ మధ్యే జరిగాయని వివరించారు.

Kishanreddy
Kishanreddy
author img

By

Published : Jul 6, 2023, 7:51 PM IST

Updated : Jul 6, 2023, 7:59 PM IST

Kishanreddy fires on CM KCR : కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే బీజేపీ లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్​కు చేరుకున్న కిషన్​రెడ్డి.. ఇవాళ సాయంత్రం హస్తిన నుంచి వచ్చిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇరువురు... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు.

Kishanreddy Latest Comments : బీఆర్​ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్రప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే విషయం విషప్రచారంగా కొట్టిపారేసిన కిషన్​రెడ్డి... ఇప్పటివరకు పొత్తులు, ఒప్పందాలు బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ మధ్యే జరిగాయని వివరించారు. బీఆర్​ఎస్​తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఒక కుటుంబమే పరిపాలన చేయటం, 9 ఏళ్లు సచివాలయానికి రాకపోవటం తెలంగాణ మోడలా అని ఆయన ప్రశ్నించారు.

ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్‌ సీఎం పీఠం ఎక్కారు : కిషన్​రెడ్డి

'నిరంకుశ పాలనకు పాతర వేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్‌ సీఎం పీఠం ఎక్కారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు అతీగతి లేదు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తాననే హామీ ఏమైంది. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైందో కేసీఆర్‌ చెప్పాలి. గిరిజన బంధు అమలు ఏమైందో కేసీఆర్‌ చెప్పాలి. ఏపీలో 15 లక్షల ప్రభుత్వ ఇళ్లు నిర్మిస్తే ఇక్కడ అతీగతి లేదు. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు. కేంద్రం సైన్స్‌ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదు.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

కుటుంబ పాలన, అవినీతిని పారదోలటమే బీజేపీ లక్ష్యం : వరంగల్‌లో రైల్వే వ్యాగన్ల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కేంద్రం నిర్మిస్తుందని కిషన్​రెడ్డి తెలిపారు. ఏడాదికి 2400 వ్యాగన్లు తయారు చేసే ప్లాంటును కేంద్రం నిర్మించనుందన్న ఆయన... ఆర్‌ఎంయూ కోసం తొలి దశలో రూ.521 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం కూడా కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందన్న కేంద్రమంత్రి... రూ.5500 కోట్ల విలువైన హైవేల నిర్మాణానికి ఈనెల 8న ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. కుటుంబ పాలన, అవినీతిని పారదోలటమే బీజేపీ లక్ష్యమన్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదన్న కిషన్​రెడ్డి... రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోందన్నారు.

'ఫలక్‌నుమా వరకు నడవాల్సిన మెట్రో ఎంజీబీఎస్‌ వద్దే ఆగింది. పాతబస్తీకి మెట్రో లైను ఎందుకు నిర్మించట్లేదో కేసీఆర్‌ చెప్పాలి. వరంగల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చేయట్లేదు. కేంద్రం రూ.1.24 లక్షల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున కేంద్రం ఇస్తోంది. రాష్ట్రంలో ఆరేళ్లు మహిళా మంత్రి లేకపోవటం తెలంగాణ మోడలా? దోపిడీ కోసం కుటుంబ సభ్యులు రాష్ట్రాలను పంచుకోవటం తెలంగాణ మోడాలా? కేసీఆర్‌ మాటల గారడీతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఎవరైనా వ్యాపారం చేస్తామంటే బీఆర్​ఎస్ నేతలు వాటాలు అడుగుతున్నారు.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

విశ్వవిద్యాలయాలు కళా విహీనంగా తయారయ్యాయి : ప్రత్యేక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు కళా విహీనంగా తయారయ్యాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. 9 ఏళ్లుగా విశ్వ విద్యాలయాల్లో పోస్టుల భర్తీ లేదు, మౌలిక వసతుల కల్పన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదన్న ఆయన... విద్యను నిర్వీర్యం చేసి సర్కారు విద్యా దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఎంతో ఆశపెట్టి ఉసూరుమనిపించారన్నారు. ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో నిప్పులు పోశారన్న కిషన్​రెడ్డి... ప్రభుత్వ పెద్దల అసమర్థత వల్లే టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని మండిపడ్డారు. అప్పులు చేసి విద్యార్థులు కోచింగ్‌ తీసుకుంటే పరీక్షలు జరగని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

విభేదాలున్నాయని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు : కిషన్‌ రెడ్డి గతంలోనూ అనేక కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కమలం పార్టీలో విభేదాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర పార్టీలు చేసే కుట్రలను భగ్నం చేయాలని కార్యకర్తలకు సంజయ్‌ పిలుపునిచ్చారు. పార్టీ కోసం కిషన్‌రెడ్డి మొదట్నుంచి కష్టపడి పనిచేశారని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 6, 2023, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.