ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి పండుగ సందర్భంగా నిజమైన క్రాంతిని కరోనా టీకా ద్వారా అందించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కంపెనీలు టీకా అనుమతి పొందితే... అందులో రెండు మన దేశంలో ఉత్పత్తి అవడం చాలా గర్వకారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకులకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకాను 50 శాతం విదేశాలకు, 50 శాతం దేశీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నట్లు ఆయన వివరించారు.
దేశంలో భారీ స్థాయిలో టీకా ఉత్పత్తి జరుగుతోందని.. దీనిని బట్టి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం దేశంలో వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో రంగువల్లులు ఆకట్టుకోగా.. సాంస్కృతిక ప్రదర్శనలు రంజింపచేశాయి.
ఇదీ చూడండి : 'తొలి రోజు లక్షా 91వేల మందికి కరోనా టీకా'