ETV Bharat / state

రెజ్లింగ్​ను ప్రోత్సహించేలా చర్యలు: కిషన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెజ్లింగ్​ క్రీడను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్​లో 4 రోజులుగా జరుగుతున్న కుస్తీ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు.

kishan-reddy-presents-prizes-to-the-winners-of-the-wrestling-competition
కుస్తీ పోటీ విజేతలకు కిషన్ రెడ్డి బహుమతుల ప్రదానం
author img

By

Published : Feb 22, 2021, 4:24 AM IST

కుస్తీపోటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో తాళ్ల గడ్డ రాజలింగయ్య కబడ్డీ స్టేడియంలో నిర్వహిస్తున్న కుస్తీపోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించేందుకు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. విజేతలకు ద్విచక్ర వాహనాలతో పాటు ఛత్రపతి శివాజీ ప్రతిమలను అందించారు.

9 ఏళ్లుగా..

యువతలో దాగి ఉన్న క్రీడాస్ఫూర్తిని వెలికి తీసే ఏకైక లక్ష్యంతో 9 ఏళ్లుగా... హిందూ వాహిని, భాజపా గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, గోవర్దన్ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 400 మంది పైల్వాన్​లు తమ పేరు నమోదు చేసుకున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.