Kishan Reddy on Telangana assembly Election 2023 : రాష్ట్రంలో ఆరు నెలలు తర్వాత ఎన్నికలు జరగవచ్చని కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్ మాటల్లో నిజం లేదని.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు(Telangana Assembly Election 2023) జరుగుతాయని.. అందులో ఎలాంటి సందేహం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంలో జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పలువురు నేతలు పాల్గొన్నారు.
KTR Comments on Telangana Election : రాష్ట్రంలో అక్టోబరులో ఎన్నికలు జరగకపోవచ్చని.. అసలు అక్టోబరులో ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవచ్చని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మరో ఆరు నెలలు తర్వాతనే ఎన్నికలు ఉండవచ్చని.. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలోనే జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాతనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
"తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అందుకు తగిన విధంగా తెలంగాణలో గెలుపొందెందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట కేసీఆర్ మాటతప్పారు. ఇప్పుడు దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లలో దళితులను మోసం చేస్తున్నారు." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
BJP Bus Yatra In Telangana : ఈ నెల 26న బీజేపీ బస్సు యాత్ర ప్రారంభం.. ముగింపు సభకు ప్రధాని మోదీ
Telangana Assembly Election 2023 : నిరుద్యోగ దీక్షను ఈ నెల 13,14 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద 24 గంటలు దీక్ష చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే అన్న కేసీఆర్.. ఆ విషయం మరచి దళితులకు తీరని మోసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి.. మరోసారి దళితులను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎస్సీ సబ్ ప్లాన్ జాడ లేదు.. దళిత బంధు పేరుతో సబ్ ఫ్లాన్‌ను బంద్ చేశారని గుర్తు చేశారు. 100 సంవత్సరాలు అయిన దళిత బంధు పూర్తి స్థాయిలో రాదని.. వివక్షతకు గురైన సామాజిక వర్గాన్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూం పేరుతో దళితులను పూర్తిస్థాయిలో మోసం చేశారన్నారు.