ఒకే దేశం ఒకే జాతి అనే నినాదంతో భారతావని నరేంద్రమోడీ నాయకత్వంలో ముందుకు సాగుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని వారాసిగూడలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని తొలిసారిగా జమ్మూకశ్మీర్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతున్న వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు సారంగపాణి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గణతంత్ర దినోత్సవం రోజున అసోంలో పేలుళ్ల కలకలం