ETV Bharat / state

Kishan Reddy Fires on BRS : బీఆర్​ఎస్​తో ఇక యుద్ధమే : కిషన్​రెడ్డి - బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై మండిపడ్డ కిషన్​రెడ్డి

Kishan Reddy Latest News : శంషాబాద్​ వద్ద నేడు పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒక ఉగ్రవాదితో, నేరస్థుడితో ఎలా వ్యవహరిస్తారో.. తనతో అలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను ప్రగతిభవన్‌లో కూర్చొని అణచివేస్తారా అంటూ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ప్రజల ఆవేదన, ఆక్రోశం బీజేపీ నేతల అరెస్టులతో తగ్గదన్న ఆయన.. ప్రజల తరఫున బీఆర్​ఎస్​తో యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించారు.

Kishan Reddy Fires on BRS
Kishan Reddy Fires on BRS
author img

By

Published : Jul 20, 2023, 2:50 PM IST

Kishan Reddy Today News : రాష్ట్రంలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూమ్ ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్రమంత్రిగా తనకు లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు తనతో ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉగ్రవాదితో, నేరస్థుడితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ప్రగతిభవన్‌లో కూర్చొని అణచివేస్తారా అంటూ సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ప్రజల ఆవేదన, ఆక్రోశం బీజేపీ నేతల అరెస్టులతో తగ్గదన్న ఆయన.. ప్రజల తరఫున బీఆర్​ఎస్​తో యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించారు. ప్రజల సమస్యల తరఫున యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయం ముందు భారీగా పోలీసుల మోహరింపు ఎందుకని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. బీఆర్​ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తే.. ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదా అని ప్రశ్నించారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదని.. అలాంటి తనను నేరస్థుడిలా చూస్తూ అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కుటుంబం అభద్రతా భావంతో ఉందన్న ఆయన.. ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై పోరాడుతుంటే తమను అరెస్టు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రజల తరఫున యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. రెండు పడక గదుల ఇళ్లు ఎవరికీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఇంకా పూర్తిస్థాయిలో ఉద్యమం ప్రారంభించలేదు. నేరస్థుడు, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో నాతో అలా వ్యవహరించారు. పేదల బాధలను చూడటానికి వెళ్తే అరెస్టులు చేస్తారా. ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో బీఆర్​ఎస్ ఉంది. రాష్ట్ర ప్రజల తరఫున యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్​ఎస్​తో యుద్ధానికి సిద్ధం. ప్రజల సమస్యల తరపున యుద్ధం కొనసాగిస్తాం. - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం..: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పట్ల పోలీసుల తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై లోక్​సభ స్పీకర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.

కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలి..: కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించిన ఆయన.. సీఎం కేసీఆర్‌ ప్రవర్తన మార్చుకోవాలన్నారు.

ఇవీ చూడండి..

Kishanreddy Fires on CM KCR : 'ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి.. కేసీఆర్‌ సీఎం పీఠం ఎక్కారు'

Bandi Sanjay in BJP sabha : 'కిషన్ రెడ్డి నాయకత్వంలో.. కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.