ETV Bharat / state

Kishan Reddy Fires on BRS : "పరిపాలన గాలికి వదిలేసి.. రియల్​ ఎస్టేట్ వ్యాపారంపై గురి పెట్టిన బీఆర్​ఎస్"​ - Nirmal district latest news

Kishan Reddy Fires on Nirmal Master Plan : బీఆర్​ఎస్​ ప్రభుత్వం సర్కార్​ భూములను విక్రయిస్తూ.. రియల్ ఎస్టేట్​ వ్యాపారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లాలో మాస్టర్ ప్లాన్ పేరుతో.. కమర్షియల్ జీఓ తీసుకువచ్చారని మండిపడ్డారు. మాస్టర్​ప్లాన్​పై ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy Fires on Nirmal Master Plan
Kishan Reddy Fires on BRS
author img

By

Published : Aug 20, 2023, 7:42 PM IST

Updated : Aug 20, 2023, 8:17 PM IST

Kishan Reddy Fires on Indrakaran Reddy : బీఆర్​ఎస్​ సర్కారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ.. రియల్​ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి..(Indrakaran Reddy)తన బంధువుల భూములకు అనుగుణంగా నిర్మల్​ మాస్టర్​ప్లాన్​(Nirmal Mastar Plan) రూపొందించారని ఆరోపించారు.

నిర్మల్​ జిల్లా ఇండస్ట్రియల్ జోన్​ను.. మాస్టర్ ప్లాన్ పేరుతో కమర్షియల్ 220 జీఓ తీసుకొచ్చారని మండిపడ్డారు. నిర్మల్​ మాస్టర్​ ప్లాన్​ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న మహేశ్వర్​రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు డీకే అరుణ(DK Aruna) వెళితే పోలీసులు అడ్డుకున్నారన్నారు. శాంతి భద్రతలు పాటించాల్సిన పోలీసులు బీఆర్​ఎస్​ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్​ఎస్​ సర్కారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటోందని దుయ్యబట్టారు. ప్రగతిభవన్ ఆదేశాలతో వందలాది ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ బంగారు తెలంగాణ చేస్తే.. ముఖ్యమంత్రి సూర్యాపేట పర్యటన సందర్భంగా ప్రజా సంఘాల నాయకులను ఎందుకు గృహనిర్బంధం చేశారని ప్రశ్నించారు.

ప్రభుత్వం పౌర హక్కులను అణిచి వేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి అనే గిరిజన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి గాయపర్చారని మండిపడ్డారు. బీజేపీ.. బాధిత మహిళకు అండగా ఉంటుందనీ స్పష్టం చేశారు. నయా నిజాంకు మించి పరిపాలిస్తున్న కేసీఆర్ పాలనపై ప్రజలు స్పందించాలనీ విజ్ఞప్తి చేశారు.

Etela Rajender criticise BRS : దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనీ బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హెచ్చరించారు. పోలీసులు చట్టపరంగా పని చేయకుండా.. కేసీఆర్​కు లోబడి పని చేస్తున్నారనీ ఆరోపించారు. మరియమ్మ అనే దళిత మహిళా చనిపోతే ఇప్పటి వరకు విచారణ లేదన్నారు. గిరిజన, దళిత మహిళలకు రక్షణ లేదనీ ఆరోపించారు. కేసీఅర్ ప్రభుత్వం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"శాంతి భద్రతలు పాటించాల్సిన పోలీసులు బీఆర్ఎస్​ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. బీఆర్​ఎస్​ పరిపాలనను పక్కన పెట్టి రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తోంది. నిర్మల్​ జిల్లాలో మాస్టర్ ప్లాన్​ పేరుతో కమర్షియల్​ జీవో తీసుకొచ్చారు. ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారు". - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

Kishan Reddy Fires on BRS "పరిపాలన గాలికి.. రియల్​ ఎస్టేట్ వ్యాపారంపై గురి పెట్టిన బీఆర్​ఎస్"​

BJP Leaders Protest on Nirmal Master Plan : ఉద్రిక్తతకు దారితీసిన మాస్టర్​ ప్లాన్​ ఆందోళన.. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

Etela Rajendar Reacted on Attack on Tribal Woman : 'గిరిజన మహిళపై దాడి ఘటన.. ఇద్దరని సస్పెండ్ చేసి సర్కార్​ చేతులు దులిపేసుకుంది'

Last Updated : Aug 20, 2023, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.