Tension at Kishan Reddy Deeksha at Dharna Chowk : నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు చుట్టుముట్టారు. ఇందిరాపార్కు వద్ద నిరసనలు, ఆందోళనలకు 6 గంటల వరకే అనుమతి ఉంటుందంటూ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే.. అడ్డుకోవడం ఏంటని కిషన్‌రెడ్డి ( Kishan Reddy )ప్రశ్నించారు.
Kishan Reddy on Telangana Elections Schedule : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కిషన్‌రెడ్డి
BJP Leaders Nirasana Deeksha in Hyderabad : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కిషన్‌రెడ్డిని బలవంతంగా బీజేపీ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కమలం నేతలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కిషన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కార్యకర్తల సపర్యలతో తేరుకున్న ఆయనను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించారు. నిరసనల మధ్యే కిషన్‌రెడ్డిని వాహనంలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళ్లగా.. అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు.
Kishan Reddy in Nirasana Deeksha :ధర్నాచౌక్ వద్ద జరిగిన తోపులాటలో కిషన్‌రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కాగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటన గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి పార్టీ వర్గాలు తీసుకెళ్లాయి. కిషన్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన అమిత్‌షా.. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని సూచించారు. కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. యువత నుంచి బీజేపీకి వస్తున్న మద్దతు జీర్ణించుకోలేకే కేసీఆర్ సర్కార్ ఇలా చేయిస్తోందని తరుణ్‌చుగ్ ఆక్షేపించారు.
BJP Leaders Nirasana Deeksha in Hyderabad : 'కేసీఆర్‌కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది'
జడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేదని తరుణ్‌చుగ్ ప్రశ్నించారు. పోలీసుల తోపులాటలో కిషన్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని.. బీజేపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలకు కూడా గాయాలైనట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని తరుణ్‌చుగ్ హెచ్చరించారు. నిరుద్యోగ దీక్ష విషయంలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తప్పుపట్టారు. ఇవాళ జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను సాగనంపితేనే.. యువత సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కమలం నేతలు (BJP Leaders)స్పష్టం చేశారు.
శాంతియుతంగా నిరుద్యోగుల కోసం తాము దీక్ష చేస్తుంటే ఈ విధంగా చేయడం అవమానకరం. కేంద్రమంత్రి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఇవాళ జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను సాగనంపితేనే యువత సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
BJP On Unemployment in Telangana : 'కేసీఆర్ సర్కార్ విఫలమైంది.. తెలంగాణలో విప్లవం మొదలైంది'