ETV Bharat / state

'తెలంగాణ సాధనలో సకల జనుల పోరాటం మరువలేనిది' - Telangana Formation Day Celebrations 2022

Kishan Reddy On Telangana Formation Day: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సకలు జనులు పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఆనాడు యూపీఏ సర్కార్ మెడలు వంచి పోరాడామన్న కిషన్​రెడ్డి... కేంద్రం తరఫున అధికారికంగా దిల్లీలో రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By

Published : Jun 2, 2022, 9:43 AM IST

'తెలంగాణ సాధనలో సకల జనుల పోరాటం మరువలేనిది'

Kishan Reddy On Telangana Formation Day: తెలంగాణ సాధనకు సకల జనులు పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి పోరాడామని పేర్కొన్నారు.

కేంద్రం తరఫున అధికారికంగా దిల్లీలో రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌షా, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని స్పష్టం చేశారు. దిల్లీ అంబేడ్కర్ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఉత్సవాలు జరుపుతున్నట్లు వివరించారు. గాయకులు మంగ్లీ, హేమచంద్ర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కింద హరియాణా విద్యార్థుల ప్రదర్శనలతో పాటు... తెలంగాణ కళాకారులతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలపై ప్రదర్శనలు ఉంటాయని కిషన్​రెడ్డి తెలిపారు.

తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటున్నాం. తెలంగాణ సాధనకు సకల జనులు పోరాటం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి. ఆనాడు యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి పోరాడాం. కేంద్రం తరఫున అధికారికంగా దిల్లీలో రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుతున్నాం. హోంమంత్రి అమిత్‌షా, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. -- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.