ETV Bharat / state

Kishan Reddy Arrest : కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - House arrest of BJP leaders in Hyderabad

Kishan Reddy Arrested : డబుల్ బెడ్​ రూం​ ఇళ్ల నిర్మాణం పూర్తైనా.. లబ్ధిదారులకు కేటాయించకుండా సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. బీజేపీ పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించేందుకు.. చలో బాటసింగారానికి పిలుపునివ్వగా అక్కడకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శంషాబాద్‌లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

KishanReddy
KishanReddy
author img

By

Published : Jul 20, 2023, 12:37 PM IST

Updated : Jul 20, 2023, 1:35 PM IST

రెండు పడక గదుల ఇళ్ల అక్రమాలపై బీజేపీ పోరుబాట

BJP Leaders House Arrest Hyderabad : రాష్ఠ్రంలోని పేదల సొంతింటి కలసాకారం చేస్తామన్న బీఆర్ఎస్ సర్కారు.. కోట్లు వెచ్చించి నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లను పంపిణీ చేయడం లేదంటూ.. రాష్ట్ర బీజేపీ విమర్శించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని.. ప్రతినిధి బృందం బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే దిల్లీ నుంచి వచ్చిన కిషన్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

Kishan Reddy Arrested : ఈ క్రమంలోనే ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి, రఘునందన్​ వర్షంలో రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ ఆందోళన విరమించాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఎలా అడ్డుకుంటారని పోలీసులను ఆయన నిలదీశారు. అనుమతి లేకుండా ఆందోళన చేయవద్దని సీపీ చౌహాన్‌ సూచించారు. అనంతరం ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి ఆయన వాహనంలోనే నాంపల్లికి తరలించారు.

అంతకుముందు బీజేపీ నేతలు బాటసింగారానికి క్షేత్రస్థాయి పరీశీలనకు వెళ్లున్నారన్న సమాచారంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. జంట నగరాల్లోని పలువురు కమలం నాయకులను, కార్యకర్తల్ని ఎక్కడిక్కడ గృహనిర్భంధం చేశారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, డీకే అరుణ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గంగిడి మనోహర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను.. పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

BJP Leaders House Arrest Hyderabad : ఈ క్రమంలోనే బీజేపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనను మరోసారి బహిర్గతం చేసిందని ఆయన ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. గిరిజనులకు గిరిజన బంధు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

"కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. గిరిజనులకు గిరిజన బంధు ఇస్తానని.. ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుంది." - ఈటల రాజేందర్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే

భారతీయ జనతా పార్టీ నేతల అరెస్ట్‌ను.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లొర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు బాటసింగారంలోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రాంతం వద్ద బారికేడ్లు, ముళ్లకంచెను ఏర్పాటుచేసిన పోలీసులు.. అక్కడకు వచ్చిన పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 20, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.